గతేడాది ‘పుష్ప2’ సినిమాతో కెరీర్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లని ఓకే చేశాడు. ఇందులో త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనుండగా, తమిళ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్- అట్లీ (Atlee) కాంబినేషన్ లో హై యాక్షన్ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా.. అట్లీ అల్లు అర్జున్ కోసం చాలా స్పెషల్ గా ఈ పాత్రని డిజైన్ చేస్తున్నాడట. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గ్లోబల్ స్టార్ నటి ప్రియాంక చోప్రా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రియాంక చోప్రాతో (Priyanka Chopra) చిత్ర బృందం సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బన్నీ రేంజుకు తగ్గట్లగా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్న ప్రియాంక చోప్రాను తీసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని డైరెక్టర్ అట్లీ భావించారట. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక రూ.35 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రాజమౌళి – మహేశ్ బాబుల (Mahesh Babu and Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘SSMB29’లో కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రియాంకచోప్రాకు రూ.30 కోట్ల పారితోషికం అందించినట్లు సమాచారం.
కాగా, అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో (Allu Arjun) తెరకెక్కనున్న ఈ సినిమాను ఈ ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ సందర్భంగా మూవీ అనౌన్స్మెంట్ తో పాటుగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదితో 22 ఏళ్లు పూర్తి కానుండగా.. అట్లీతో చేయనున్న సినిమా కూడా బన్నీ కెరీర్‌లో 22వ చిత్రం కావడం విశేషం. దాంతో అల్లు అర్జున్ ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తునందుకు గానూ బన్నీ ఏకంగా రూ.175 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ (Amaran Siva Karthikeyan) నటించనున్నట్లు తెలుస్తోంది.

