ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది
16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్ కతా నైట్ రైడర్స్ ను కెప్టెన్ రహానే, రఘువంశీ లు మూడవ వికెట్ కు 81 పరుగులు జోడించి ఆదుకున్నారు
38 పరుగులు చేసిన రహానే అనవసర షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. రహానే అవుట్ అయిన కాసేపటికే సరిగ్గా 32 బంతుల్లో 50 పరుగులు చేసిన రఘువంశి కూడా అవుట్ అయ్యాడు
106 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల కు చుక్కలు చూపించారు
వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లు ఐదవ వికెట్ కు 91 పరుగులు జోడించాక, 29 బంతుల్లో, 3 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాడు. రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చివరి ఐదు ఓవర్ల లో, అంటే 30 బంతుల్లో 78 పరుగులు చేసింది
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో షమీ, కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ లు తలా ఒక వికెట్ తీశారు

