చిత్తు చిత్తుగా  ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్

by | Apr 4, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన  మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు

పేరుకు అందరు పవర్ హిట్టర్లు కానీ సమయానికి ఎవరు ఆడడం లేదు. ఈ మధ్య పూర్తిగా 20 ఓవర్లు కూడా ఆడలేకపోతోంది సన్ రైజర్స్ జట్టు. ఈ మ్యాచ్ లో 16.4 ఓవర్ల లో 120 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కుప్పకూలింది.  33 పరుగులు చేసిన క్లాసెన్ సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్

ఆ తరవాత కమిందు మెండిస్ 27 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు చేసి పరవాలేదనిపించారు. కెప్టెన్ కమిన్స్ 14 పరుగులు చేశాడు.  మిగతా ఏ ఒక్క ఆటగాడు రెండంకెల స్కోర్ చేయలేదు.

ట్రావిస్ హెడ్ 4 పరుగులు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు రెండేసి పరుగులు చేసి అవుట్ అయ్యారు

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి లు మూడేసి వికెట్లు తీయగా, రస్సెల్ రెండు వికెట్లు తీశాడు. హర్షిత్ రానా, సునీల్ నరైన్ లు చెరో ఒక వికెట్ తీశారు

మూడు కీలక వికెట్ లు తీసిన వైభవ్ అరోరా కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

అంతకు ముందు టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది

16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్ కతా నైట్ రైడర్స్ ను కెప్టెన్ రహానే, రఘువంశీ లు మూడవ వికెట్ కు 81 పరుగులు జోడించి ఆదుకున్నారు

38 పరుగులు చేసిన రహానే అనవసర షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు.  రహానే అవుట్ అయిన కాసేపటికే సరిగ్గా 32 బంతుల్లో 50 పరుగులు చేసిన రఘువంశి కూడా అవుట్ అయ్యాడు

106 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల కు చుక్కలు చూపించారు

వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లు ఐదవ వికెట్ కు 91 పరుగులు జోడించాక, 29 బంతుల్లో, 3 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాడు.  రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చివరి ఐదు ఓవర్ల లో, అంటే 30 బంతుల్లో 78 పరుగులు చేసింది

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో షమీ, కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ లు తలా ఒక వికెట్ తీశారు