సినిమా హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సరి కొత్త కధలను ఎంచుకుంటూ ముందుకు సాగిపోతోన్న హీరో సుహాస్. సుహాస్ సినిమాలు ఓ టి టి, టెలివిజన్ లో బాగానే నడుస్తాయి. ఎందుకంటె సుహాస్ (Suhas) ఎంచుకునే కధలు అలాంటివి
ప్రస్తుతం సుహాస్ నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ ఓ భామ అయ్యో రామ’.(O Bhama Ayyo Rama) ఈ చిత్రంలో మలయాళ నటి మాళవిక మనోజ్ కధానాయిక. వీ ఆర్ట్స్ పతాకం పై హరీష్ నల్ల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రామ్ గోధల దర్శకుడు. దగ్గుబాటి రానా (Rana) స్పిరిట్ మీడియా వారు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు
ఇప్పుడు ఈ ఓ భామ అయ్యో రామ నుండి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రధన్ సంగీత దర్శకత్వం వహించారు. ‘ఎలాగుండే వాణ్ణే ఎలా అయిపోయానే’ అంటూ సాగే ఈ పాత ఆకట్టుకుంది.

