ఎండలు మండిపోతున్న తరుణంలో హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడింది. అంతే కాకుండా బలమైన గాలులు వీచాయి. ఈ వర్షం తో హైదరాబాద్ నగరం చల్లబడింది.
ఆటు హిమాయత్ నగర్, ఇటు హయత్ నగర్ లో, ఇంకా కోటి, జూబ్లీహిల్స్, అబిడ్స్, ఎల్ బి నగర్, కోటి, మేడ్చల్, అమీర్ పేట, మెహదీపట్నం, ఖైరతా బాద్, పంజా గుట్ట, కూకట్ పల్లి, లక్డిక పూల్, మాసాబ్ ట్యాంక్ లలో వర్షం పడింది. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంకా నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాలలో కూడా భారీ వర్షం పడుతోంది
ఉరుములు, గాలులతో కూడిన వర్షం పడడంతో హైదరాబాద్ నగర వాసులకు ఎండ వేడి నుండి ఉపశమనం కలిగింది
భారీ వర్షం, బలమైన గాలులు, ఉరుములు వలన అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకండి.
అయితే తాత్కాలికంగా చల్లబడ్డా, రెండు మూడు రోజుల తరవాత ఎండలు అదిరిపోయే అవకాశం ఉంది

