‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విడుదల ఈ రోజే అన్న కళ్యాణ్ రామ్

by | Apr 3, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. 

కుంతి దేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు అని ఎన్టీఆర్ ఆర్ట్స్ పోస్ట్ చేస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 18 న విడుదల చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. యాక్షన్, ఎమోషన్ అంశాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని నందమూరి కల్యాణ్ రామ్ పోస్ట్ చేశారు

ఇందులో సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా, ఈ సినిమాలో శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు

భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.