తెలుగు చిత్ర పరిశ్రమలో గతేడాది టిల్లు స్క్వేర్‌తో అభిమానులను మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేయగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. టైటిల్లో పెట్టినట్లుగానే ఈ జాక్ కొంచెం క్రాక్ అనిపించేలా ట్రైలర్ రూపొందించారు. జాక్ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఓ డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) జాక్ అనే ప్రయివేట్ స్పై ఏజెంట్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే అయితే ‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీ తరహాలోనే ‘జాక్’ (Jack) చిత్రాన్ని కూడా భాగాలుగానే తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ‘జాక్’ మూవీ సిరీస్ ను మూడు సినిమాలుగా తెరకెక్కించనుండగా.. ఈ సిరీస్ లోని తొలి సినిమాకి ‘జాక్’ అని రెండో సినిమాకు ‘జాక్ ప్రో’ అని అలాగే మూడో సినిమాకు ‘జాక్ ప్రో మ్యాక్స్’ అని టైటిల్స్ కూడా ఫిక్స్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కాగా, జాక్ సినిమాలో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యుత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ జాక్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.

