టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావడంలేదు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మూవీని మేలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా ఈ మూవీ మరికొన్ని నెలలు వాయిదా పడేలా కనిపిస్తుంది. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘విశ్వంభర’లో (Viswambhara) చిరంజీవి ఒక పాట పాడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పాటను మూవీ ప్రమోషన్స్ రూపంలో త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా.. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. గతంలో చిరంజీవి తొలిసారిగా ‘మాస్టర్’ చిత్రంలో ‘తమ్ముడు అరె తమ్ముడూ’ అనే యూత్‌ఫుల్ సాంగ్‌ని ఆలపించారు. ఆ తర్వాత ‘మృగరాజు’ చిత్రంలో ‘చాయ్ చాయ్ చూడరా భాయ్’ అనే పాటని అలరించారు. అయితే ఇప్పుడు విశ్వంభర సినిమా కోసం కూడా పాట పాడుతుండడంతో మెగా ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి (Chiranjeevi పాడిన ఈ పాటకు దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్అందించనున్నారు. అయితే ఇంకా ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారికంగాఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, సోషియో ఫాంటసీ జానర్లో ‘విశ్వంభర’ సినిమా రూపొందుతుందన్న సంగతి తెలిసిందే. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత మెగాస్టార్ నుంచి ఈ జానర్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

