‘హిట్ 3’లో కార్తీ.. హిట్ 4లో హీరోగా!

by | Apr 3, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’ ఫుల్ లెంగ్త్ క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా నాని (Nani) కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిట్ 3 (HIT) సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) స్పెషల్ రోల్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కార్తీ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని.. నాని-కార్తీ కాంబోలో వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. కార్తీ పోషించబోయే పాత్ర ‘హిట్-4’ మూవీ కొనసాగింపుగా, అందులో హీరోగా ఉండబోతుందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ తవరలోనే రానున్నట్లు సమాచారం. కాగా, హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకుముందు యువ హీరోలు విష్వక్‌ సేన్‌ ‘హిట్‌’, అడివి శేష్‌ ‘హిట్‌ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్​ 3’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా వేసవి కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి (Srnidhi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.