మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్‌కి (Venkatesh) భారీ బ్లాక్ బస్టర్ అందించారు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవికి కూడా మరో సూపర్ హిట్ అందించేందుకు అనిల్ రావిపూడి సిద్ధమయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన చిత్ర యూనిట్ ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు డైరెక్టర్ అనిల్ (Anil Ravipudi). అయితే ‘మెగా157’ సినిమా కోసం చిరంజీవి కూడా విక్టరీ వెంకటేష్ ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో హీరో వెంకటేష్ ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. దీనికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘మెగా 157’ సినిమా కోసం చిరంజీవితో కూడా ఓ సాంగ్ పాడించేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరహాలోనే ఈ సినిమాను కూడా అభిమానుల్లోకి తీసుకెళ్లేందుకు అనిల్ రావిపూడి ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మింస్తుండగా.. చిరంజీవి ఈ సినిమాలో తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

