టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవలే ‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం తండేల్ విజయాన్ని ఆస్వాదిస్తున్న నాగ చైతన్య తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగ చైతన్య (Naga Chaitanya). గతేడాది చైతూ బర్త్ డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఎన్సీ24’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బోగవల్లి ప్రసాద్-సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో 24వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
ఇందులో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే చైతూ తన 25వ సినిమా కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కిషోర్ అనే కొత్త డైరెక్టర్ తో తన 25వ సినిమాను నాగ చైతన్య చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నాగ చైతన్యను కలిసిన దర్శకుడు కిషోర్ మూవీ స్క్రిప్ట్ మొత్తం వినిపించగా నాగ్ చైతన్యకి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య మునుపెన్నడూ లేని మేకోవర్ లో కనిపించనున్నట్లు సమాచారం.
భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో ఈ చిత్రాన్ని రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా, ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

