రన్ రాజా రన్, సాహో చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుజిత్. ఇతడి దర్శకత్వంలో పవర్ స్యార్ పవన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (OG ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఇందులో అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేశారట మేకర్స్.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించడం కుదరడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా మే 9న విడుదలవనుండగా.. ఆ తర్వాత ఓజీకి పూర్తి డేట్స్ కేటాయించి సెప్టెంబరులో ఈ సినిమాను రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే నుంచి వరుసగా 30 రోజుల కాల్షీట్స్ ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననుండగా ముఖ్య ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. దింతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానుందట. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

