సెగలు రేపుతున్న ‘శర్వా 38’.. ఈసారి రచ్చ రచ్చే

by | Mar 31, 2025 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇందులో ఒకటి సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు బాలయ్య ఆల్‌ టైమ్‌ సూపర్ హిట్ మూవీ నారీ నారీ నడుమ మురారి Nari Nari Naduma Murari) టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తుండగ.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక శర్వానంద్‌ హీరోగా చేస్తున్న మరో సినిమా అభిలాష్‌ కంకర దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘శర్వా36’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నది. త్వరలోనే టైటిల్‌ని ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని విక్రమ్‌ సమర్పణలో వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

ఇక శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న 38వ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా స్టోరీ బ్యాగ్డ్రాప్ విషయానికొస్తే..1960లలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన కథగా ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకోసం హీరో శర్వానంద్‌ సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు. బాలీవుడ్‌ ఫేమస్ స్టయిలిస్టులు ఆలిమ్‌ హకీమ్‌, పట్టణం రషీద్‌లు తాజాగా ఈ మూవీ కోసం శర్వానంద్ ను యూనిక్ లుక్‌లోకి మార్చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కెమెరామెన్ గా సౌందర్‌ రాజన్‌.ఎస్‌ వ్యవహరిస్తుండగా.. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.