చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్

by | Mar 31, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా  రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది

183 పరుగుల లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్ ను ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ కు మొదటి ఓవర్లోనే షాక్. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ రచిన్ రవీంద్ర డక్ అవుట్ అవడం. 

ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి తో కైలిసి రెండవ వికెట్ కు 45 పరుగులు జోడించారు. 23 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి హాసరంగా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.  అక్కడి నుండి చెన్నై సూపర్ కింగ్స్ క్రమం తప్పకుండ వికెట్లు కోల్పోతూ వచ్చింది.

ఒక వైపు ఋతురాజ్ గైక్వాడ్ నిలబడినా, విలువైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోయింది.   గైక్వాడ్ 44 బంతుల్లో 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ధోని 16 పరుగులు చేసి అవుట్ అవగా¸ జడేజా 32 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

చివరకు చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది

లక్ష్యం అంత పెద్దగా లేక పోయినా, సూపర్ ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర డక్ అవుట్ అవడం, పెద్ద పెద్ద భాగస్వామ్యాలు నిర్మించలేకపోవడం, రచిం రవీంద్ర, ఋతురాజ్ గైక్వాడ్ ల మీదే ఎక్కవగా ఆధార పడడం  వంటి అంశాలు చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ప్రధాన కారణాలు. శివమ్ దూబే ఫామ్ లేమి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ని కలవరపెడుతోంది 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో హాసరంగా నాలుగు వికెట్లు తీయగా, సందీప్ శర్మ, జొఫ్రా ఆర్చర్ లు చెరో ఒక వికెట్ తీశారు

అంతకు  ముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.  రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ అవుట్ అయ్యాడు

రెండవ వికెట్ కు మరో ఓపెనర్ సంజు శాంసన్, వన్ డౌన్ లో వచ్చిన నితీష్ రానా లు 82 పరుగులు జోడించారు. 20 పరుగులు చేసిన సంజు శాంసన్ అవుట్ అయ్యిన తరవాత వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ తో కలిసి నితీష్ రానా మూడవ వికెట్ కు 38 పరుగులు జోడించారు

నితీష్ రానా కేవలం 36 బంతుల్లో 5 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన ధృవ్ జురెల్, హాసరంగా లు తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యినా, కెప్టెన్ రియాన్ పరాగ్ స్కోర్ బోర్డు ను హేట్మేయర్ సాయంతో కదిలించాడు.  అయితే 37 పరుగులు చేసిన రియాన్ పరాగ్ అవుట్ అవడంతో స్కోర్ బోర్డు లో వేగం తగ్గింది

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరానా లు రెండేసి వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా లు చెరో ఒక వికెట్ తీశారు

విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రానా కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది