ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ లు మొదటి వికెట్ కు 45 పరుగులు జోడించారు
ధాటిగా ఆడిన ఫిల్ సాల్ట్ 16 బంతుల్లో 32 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
విరాట్ కోహ్లీ ఆచి తూచి ఆడుతూ 30 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ ధాటిగా ఆడే క్రమంలో 14 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే కెప్టెన్ రజత్ పటిదార్ ధాటిగా ఆడుతూ 32 బంతుల్లో 51 పరుగులు చేసి , పతిరాన బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
17.3 ఓవర్ల కు నాలుగు వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో 5 పరుగులు జోడించి మూడు వికెట్లు కోల్పోయింది
ఆఖరి ఓవర్లో, టిమ్ డేవిడ్ వరస మూడు సిక్సర్లతో సామ్ కరణ్ కు చుక్కలు చూపించాడు. టిమ్ డేవిడ్ 8 బంతుల్లో 22 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 7 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, పతిరాన రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో ఒక వికెట్ తీశారు

