ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి నుండి తడబాటుకు గురవుతూనే ఉంది. మొదటి ఐదురుగు ఆటగాళ్లలో ఒక రచిం రవీంద్ర తప్ప ఎవరు రెండంకెల స్కోర్ చేయలేదు. కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ డక్ అవుట్ అయ్యాడు
41 పరుగులు చేసిన ఓపెనర్ రచిన్ రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. శివమ్ దూబే 19 పరుగులు, జడేజా 25 పరుగులు చేయగా, మిస్టర్ కూల్ ధోని 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి విజయానికి 50 పరుగుల దూరంలో నిలిచిపోయింది
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో హేజిల్ వుడ్ మూడు వికెట్లు తీయగా, యష్ దయాల్, లివింగ్ స్టోన్ లు చెరో రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు
ఈ మ్యాచ్ లో నమోదైన ఏకైక అర్ధ సెంచరీ చేసిన రజత్ పటిదార్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది
పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది
అంతకు ముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ లు మొదటి వికెట్ కు 45 పరుగులు జోడించారు
ధాటిగా ఆడిన ఫిల్ సాల్ట్ 16 బంతుల్లో 32 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
విరాట్ కోహ్లీ ఆచి తూచి ఆడుతూ 30 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ ధాటిగా ఆడే క్రమంలో 14 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే కెప్టెన్ రజత్ పటిదార్ ధాటిగా ఆడుతూ 32 బంతుల్లో 51 పరుగులు చేసి , పతిరాన బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
17.3 ఓవర్ల కు నాలుగు వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో 5 పరుగులు జోడించి మూడు వికెట్లు కోల్పోయింది
ఆఖరి ఓవర్లో, టిమ్ డేవిడ్ వరస మూడు సిక్సర్లతో సామ్ కరణ్ కు చుక్కలు చూపించాడు. టిమ్ డేవిడ్ 8 బంతుల్లో 22 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 7 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, పతిరాన రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో ఒక వికెట్ తీశారు


