‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సూపర్ కలెక్షన్స్.. యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద రచ్చ

by | Mar 28, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వ‌స్తున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’. సూప‌ర్ హిట్ సినిమా మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ వ‌స్తుంది. నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్‌ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు (మార్చి 28) విడుదలైంది. ఇప్పుటికే ఓవర్సీస్‌లో సినిమాను చూసిన సినీ అభిమానులు మ్యాడ్‌ స్క్వేర్‌ (Mad Square) మూవీ గురించి ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కాలేజీలో పరిచయం అయిన కొందరు స్నేహితులు చాలా రోజుల తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి మధ్య జరిగే కామెడీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు.

ఈ సినిమా ఇప్పటికే అమెరికా, లండన్‌, ఆస్ట్రేలియా వంటి నగరాల్లో షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతంలో మ్యాడ్‌ సినిమాకు వచ్చిన హిట్ టాక్ ఇప్పుడు ఈ సినిమాకు కూడా సోషల్‌మీడియాలో వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందే సాలిడ్ హైప్ నే క్రియేట్ అవగా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్ ని అందుకుంది. కేవలం ప్రీమియర్స్ తోనే ఉహించని రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మ్యాడ్ స్క్వేర్ (Mad Square) మూవీ ప్రీమియర్స్ కలెక్షన్లతోనే ఏకంగా 3 లక్షల డాలర్స్ కి పైగా అందుకున్నట్లుగా సమాచారం. ఇలా విడుదలకు ముందే ఈ సినిమా మంచి వసూళ్లు అందుకోగా లాంగ్ థియేట్రికల్ రన్ లో భారీగా కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.