టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్డమ్’. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నారు. ఇక విజయ్ దేవరకొండ తన తర్వాతి చిత్రాన్ని రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ కథతో రాబోతుండగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా ‘రౌడీ జనార్ధన’ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) జోడీగా హీరోయిన్ పాత్ర కోసం చిత్ర బృందం మహానటి కీర్తీ సురేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కథతో పాటు తన పాత్రను రూపొందించిన తీరుకు ఫిదా అయిన కీర్తీ సురేష్ గ్రీన్‌సిగ్నల్ వెంటనే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ మూవీలో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా, కీర్తీ సురేశ్ (Keerthy Suresh) కొంత కాలంగా సినిమాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా క్రేజీ లైనప్ ను సెట్ చేసుకుంటోంది. పెళ్లి తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ‘రౌడీ జనార్ధన’ సినిమా విషయానికొస్తే.. లార్జర్ దేన్ లైఫ్ అన్నట్లు రూరల్ యాక్షన్ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ మే మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

