‘హరి హర వీరమల్లు’.. ఫినిషింగ్ టచ్ ఇస్తున్న పవన్!

by | Mar 27, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. హరిహరవీరమల్లు మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారు చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే డబ్బింగ్ పార్ట్‌ను కూడా ఇటీవలే ప్రారంభించినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పనులు కొంత భాగం మిగిలి ఉండగా ప్రస్తుతం ఖమ్మం శివార్లలో వేసిన ప్రత్యేక సెట్స్ లో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చివరి షెడ్యూల్ లో హీరో పవన్‌ కళ్యాణ్ కు సంబంధించి కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవనున్నట్లు సమాచారం.

ఇక భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో మే 9న విడుదల కానుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ (Hari Hara Veera Mallu) పేరుతో విడుదల కానుంది. ఇక మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవర్ స్టార్ అభిమానులను అలరించనున్నారు.