ఉబర్, ఓలా కు పోటీగా కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీ సర్వీస్

by | Mar 27, 2025 | వార్తలు

ప్రస్తుతం టాక్సీ సర్వీస్ లు అందిస్తున్న ఓలా, ఉబర్ లకు పోటీగా కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీ సర్వీస్ ను తీసుకు రానుంది.  భారత దేశం అంతటా ఈ సర్వీస్ ను తీసుకు రానుంది కేంద్ర ప్రభుత్వం

సహకార్ టాక్సీ సర్వీస్ ద్వారా వచ్చే లాభాలను నేరుగా టాక్సీ డ్రైవర్లకే ఇస్తారు. ఈ విషయాన్నీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2 వీలర్స్, రిక్షాలు, 4 వీలర్స్ ను ఈ సంస్థలో రిజిస్టర్  చేసుకుంటారు

ఈ సంస్థ సహకార సంస్థ తరహాలో పని చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో యాత్రి సౌదీ పేరుతో మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కర్ణాటకలో నమ్మ యాత్రి కూడా ఈ కోవకు చెందినదే.  ఇందులో వచ్చే లాభాలన్నీ డ్రైవర్లకు చెందేలా ఈ సర్వీసులు ఉంటాయి