లక్నో సూపర్ జెయింట్స్ బలం రిష పంత్ ఒక్కడే!

by | Mar 24, 2025 | ప్రగడ టీవీ

లక్నో సూపర్ జెయింట్స్ టీం ఎలా ఉందొ చూద్దాం

 లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ; కోచ్ : జస్టిన్ లాంగర్

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్  : RPSG Sports Private Limited

లక్నో సూపర్ జెయింట్స్ టీం లో మంచి హిట్టర్లు ఉన్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మార్క్రమ్ లు ఉన్నారు.  వీరితో పాటు ఆర్యన్ జుయల్, హిమ్మత్ సింగ్, మాధ్యుస్ బ్రీజ్కే లు కూడా అవకాశమొస్తే బాట్ ఝుళిపించడానికి సిద్ధంగా ఉన్నారు.

అల్ రౌండర్ లు మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ఆయుష్ బదోని లు లక్నో సూపర్ జెయింట్స్ బలం. ఇంకా యువ అల్ రౌండర్ లు యువరాజ్ చౌదరి, రాజ్ వర్ధన్, కులకర్ణి లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు

బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా లేకపోయినా ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. పేస్ బౌలింగ్ విభాగంలో , ఆకాష్ దీప్, ఆవేశ్ ఖాన్ లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రధాన బౌలర్లు. మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్ లు కూడా రాణించాలి

లక్నో సూపర్ జెయింట్స్ ప్రధాన స్పిన్నర్ రవి బిష్ణోయ్. అంతే కాకుండా సిద్దార్ధ్ రూపంలో ఒక అసాధారణ స్పిన్నర్ ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ లో బంతిని స్వింగ్ చేయగలడు. ఐపీల్ లో కేవలం మూడు మ్యాచ్ లే ఆడిన సిద్దార్ధ్ కు ఈ సారి అవకాశం రావచ్చు.   దిగ్వేశ్ సింగ్ రూపంలో ఒక లెగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. అల్ రౌండర్ ల కోటా లో ఉన్న అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ లు కూడా ఉపయుక్తమైన స్పిన్నర్లు

లక్నో సూపర్ జెయింట్స్ ముఖ్య ఆటగాళ్లు రిషబ్ పంత్, మిల్లర్, పూరన్, మిచెల్ మార్ష్, రవి బిష్ణోయ్.  లక్నో సూపర్ జెయింట్స్ కు స్పిన్నర్ లు, స్లో బౌలర్ లు చాల మంది ఉన్నారు. వీళ్ళతో పాటు జట్టంతా సమిష్టిగా రాణించడంపై లక్నో సూపర్ జెయింట్స్ విజయావకాశాలు ఉంటాయి.