కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తోన్న జన నాయగన్ విడుదల కోసం అయన అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
పూజ హెగ్డే విజయ్ కు జోడిగా నటిస్తోంది. ఇంకా మమిత బైజు, బాబీ డియోల్, ప్రియమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. జన నాయగన్ విజయ్ నటించిన 69 వ సినిమా
తమిళగ వెట్రి కళగం అనే పార్టీ స్థాపించిన విజయ్, 2026 లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతోన్న విజయ్ జన నాయగన్ తరవాత సినిమాలలో నటించరని తెలుస్తోంది. రాజకీయాలలోకి వెళ్లిన తరవాత సినిమాలలో నటిస్తారా లేదా పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారు అనే విషయం తెలియాలి


