రెచ్చిపోయిన నికొలస్ పూరన్, మిచెల్ మార్ష్ ; ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 210 పరుగులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. మొదటి వికెట్ కు మార్క్రమ్, మిచెల్ మార్ష్ లు 46 పరుగులు జోడించిన తరవాత మార్క్రమ్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. 17 పరుగుల వద్ద విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో, సమీర్ రిజ్వి క్యాచ్ డ్రాప్ చేయడంతో జీవన దానం లభించిన పూరన్ చెలరేగిపోయాడు
మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు, నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 87 పరుగులు జోడించారు.
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ డక్ అవుట్ అవడం, ఆయుష్ బదోని, శార్దూల్ ఠాకూర్ వెంట వెంటనే అవుట్ అవడం చక చకా జరిగిపోయాయి
కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు ముగ్గురు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మన్ లు డక్ అవుట్ అయ్యారు. చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు మిల్లర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్ లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, విప్రాజ్ నిగమ్,ముకేశ్ కుమార్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు

