17 ఏళ్ళ నుండి ఐపీల్ ఆడుతున్నా ఇప్పటి వరకు ఒక్కసారైనా ఐపీల్ ట్రోఫీ ని గెలవలేకపోయిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి రెండు సీజన్లలో సెహ్వాగ్ నాయకత్వంలో సెమి ఫైనల్ కు వచ్చిన ఢిల్లీ క్యాప్టిల్స్, 2020 లో మాత్రం శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఫైనల్ కు చేరింది. అయితే ఫైనల్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి దాకా ఎక్కువగా వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఆడింది.
ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి తెలుసుకుందాం
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ : అక్షర్ పటేల్ ; కోచ్ : హేమాంగ్ బదాని
ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ : JSW GMR Cricket Pvt Ltd
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఏడుగురు బ్యాట్స్ మన్ లు ఉన్న భారమంతా కె ఎల్ రాహుల్, డుప్లెసిస్ ల మీదే. గత సీజన్లో రాణించిన జేమ్స్ ఫ్రేజర్ మేక్ గుర్క్ ఈ సీజన్లో రాణించాలని ఢిల్లీ క్యాపిటల్స్ కోరుకుంటోంది. కరుణ్ నాయర్, స్టబ్స్ కూడా పరవాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ లో విధ్వంసకర ఓపెనర్ లు ఎవరు లేరు. ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు లేరు
అల్ రౌండర్ల విభాగం లో 9 మంది ఉన్నా, అక్షర్ పటేల్ తప్ప చెప్పుకోదగ్గ ఆటగాళ్లు ఎవరు లేరు. అంతగా అనుభవం లేని సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, దర్శన్ నలకందే మీద ఆధారపడలేని పరిస్థితి ఐపీల్ లో అరంగేట్రం చేయాలనీ తహ తహలాడుతున్న యువ ఆటగాళ్లు విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, విజయ్, మాధవ్ తివారి లను అక్షర్ పటేల్ పరీక్షించవచ్చు. అల్ రౌండర్స్ డిపార్ట్మెంట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలహీనంగా ఉంది
ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఐదుగురు ఆటగాళ్లను పరీక్షించడానికి అక్షర్ పటేల్ కు ఇదొక మంచి అవకాశం.
బౌలింగ్ డిపార్ట్మెంట్ కు వస్తే పేస్ బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్, చమీరలు ఉన్నారు
ఇక స్పిన్ విభాగానికి వస్తే కెప్టెన్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు ఉన్నారు. అల్ రౌండర్ ల కోటా నుండి బెంచ్ మీద సమీర్ రిజ్వి, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, విజయ్ ల రూపం లో స్పిన్నర్ లు ఉన్నారు. అయితే అక్షర్ పటేల్ వీళ్లకు అవకాశాలు ఇచ్చి చూడాలి.

