అఖిల్ ‘లెనిన్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

by | Mar 23, 2025 | సినిమా

తెలుగు చిత్ర సీమలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో ఒకరు అక్కినేని అఖిల్‌‌ (Akhil). గతంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద వద్ద నిరాశ పరిచింది. ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్‌ తదుపరి సినిమా ఏంటి అని ఎదురుచూస్తున్న వారి కోసం కొత్త అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్‌ కిరణ్‌ మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి ‘లెనిన్‌’ (Lenin) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా చిత్తూరులోని భారతం మెట్ట ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌ లో ఏకధాటిగా 10 రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో హీరో అఖిల్ తో పాటుగా స్కామ్ 1992 ఫేమ్ ప్ర‌తీక్ గాంధీ, అజయ్ ఘోష్ తో పాటుగా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారట. ఈ షెడ్యూల్ చివర్లో అఖిల్, శ్రీలీల (Sree Leela) పై ఓ ప్రేమ పాటను కూడా షూట్ చేయనున్నట్లు సమాచారం. కాగా, భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్డూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే వరుస షెడ్యూల్స్ లో వేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు మేకర్స్.