సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ ; ఇషాన్ కిషన్ సెంచరీ

by | Mar 23, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోంది మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్  ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది

సన్ రైజర్స్ హైదరాబాద్ అంటేనే బాదుడుకు మరో పేరు.  ఓపెనర్ అభిషేక్ శర్మ 11 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన ఇషాన్ కిషన్ తో జత కలిసిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారీ స్కోర్ లక్ష్యంగా బాదడం మొదలు పెట్టారు. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ లు రెండవ వికెట్ కు 85 పరుగులు జోడించారు. 31 బంతుల్లో, 3 సిక్సర్లు, 9 ఫోర్ల  సాయంతో 67 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ మూడవ వికెట్ కు ధాటిగా ఆడుతూ 72 పరుగులు జోడించారు.  నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఇషాన్ కిషన్ కు మరో పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ జత కలిశాడు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 56 పరుగులు జోడించారు.  క్లాసెన్ 14 బంతుల్లో 34 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు  

వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల పై విరుచుకుపడి 47 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  ఈ ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి.  ఇషాన్ కిషన్ కు ఇదే ఐపీల్ లో మొదటి సెంచరీ. ఐపీల్ 2025 లో కూడా మొదటి సెంచరీ  

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మన్, మానవత్వం మరచిపోయి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ని చీల్చి చెండాడారు. ఎంతలా అంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఆర్చర్ 4 ఓవర్ల లో 76 పరుగులు, ఫారూఖీ 3 ఓవర్ల లో 49 పరుగులు సమర్పించుకున్నారు.  అయినా వీరిద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేదు

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో  తుషార్ దేశ్ పాండే మూడు వికెట్ లు తీయగా, తీక్షణ రెండు వికెట్లు , సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు