బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం తర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ మూవీ రానుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ‘సికందర్’ ఒకటి. మేకర్స్ సికిందర్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ భారీ యాక్షన్ హంగులతో పవర్ ప్యాక్డ్ గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు
కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా.. రంజాన్ కానుకగా మార్చి 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని సల్మాన్ అభిమానులు ఆశిస్తున్నారు.

