మెగా స్టార్ చిరంజీవి, రాధ, భానుప్రియ నటించిన స్టేట్ రౌడీ చిత్రం విడుదలై నేటికీ 36 సంవత్సరాలు అయ్యింది. 1989 మార్చ్ 23 న స్టేట్ రౌడీ విడుదల అయింది. టి సుబ్బ రామిరెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీ కి దర్శకుడు బి గోపాల్. బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించారు
మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో స్టేట్ రౌడీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ కధ, మాటలను సమకూర్చారు
మెగా స్టార్ పాత్ర పేరు కాళీ చరణ్. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కన్న వ్యక్తి స్టేట్ రౌడీ గా ఎందుకు మారాడు అనేది చిత్ర మూల కధ. రెండవ భాగంలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు
ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్. ఈ రోజు కు రాధా, రాధా మదిలోన పాట మారుమ్రోగుతూ ఉంటుంది. వన్, టు, త్రి, ఫోర్ పాటలో మెగా స్టార్ చిరంజీవి బ్రేక్ డాన్స్ చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఈ పాటలో చిరంజీవి, రాధా టీ తగ్గుతూ వేసే స్టెప్ బాగా పాపులర్ అయ్యింది
స్టేట్ రౌడీ ఆడియో ఫంక్షన్ కు కమల్ హాసన్ వస్తే, 100 డేస్ ఫంక్షన్ కు రజనీకాంత్ వచ్చారు

