గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
తాజాగా ‘ఆర్సీ16’ టైటిల్ కు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉండగా.. తాజాగా చిత్ర బృందం ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మార్చి 27న రామ్‌చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ తో పాటుగా టీజర్ రిలీజ్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఇదే రోజున ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది కూడా మేకర్స్ ప్రకటించనున్నారట. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ చిత్రీకరణ ఇంకా చాలా వరకు పూర్తవకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీ స్టోరీ బ్యాగ్డ్రాప్ విషయానికొస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్ అన్ని ఆటల్లో ప్రావీణ్యుడై ఉంటాడట. అందుకే క్రికెట్, కుస్తీ, కబడ్డీ.. ఇలా ఏ గేమ్ అయినా సరే కొంత డబ్బులిస్తే, వాళ్ల జట్టు తరఫున బరిలోకి దిగుతూ ఒంటిచేత్తో తన జట్లను గెలిపిస్తూ ఉంటాడట. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ హైద్రాబాద్ లో పూర్తవగా.. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

