స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హై యాక్షన్ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా.. అట్లీ అల్లు అర్జున్ కోసం చాలా స్పెషల్ గా ఈ పాత్రని డిజైన్ చేస్తున్నాడట. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ (Sun Pictures) ఈ సినిమాను నిర్మించనుండగా.. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, వీరిలో ముగ్గురు ఫారెన్ హీరోయిన్లు ఉండనున్నారని అంటున్నారు.
అయితే ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హీరో కమ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. సింపుల్ లుక్ లో హీరో పాత్ర ఉండనుండగా.. రెండో పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్స్ తో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ తరహా లుక్ లో ఇందులో నెగెటివ్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బన్నీ కెరీర్లో ఇదే ఫస్ట్ డ్యూయల్ రోల్ మూవీ అవుతుంది. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండనుండగా.. ఇందులో అల్లు అర్జున్ )Allu Arjun) ఓ సరికొత్త లుక్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఇప్పటికే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళి మరీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారట. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తునందుకు గానూ బన్నీ ఏకంగా రూ.175 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ఈ మూవీలో శివకార్తికేయన్ పాత్రలో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

