ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
175 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ కి ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గొప్ప శుభారంభాన్నిచ్చారు.
వీరిద్దరూ ధాటిగా ఆడుతూ మొదటి వికెట్ కు 8.3 ఓవర్లలో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన దేవ్ దత్ పడిక్కల్ 10 పరుగులు చేసిన సునీల్ నరైన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
అయితే ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రజత్ పటీదార్, విరాట్ కోహ్లీ లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరూ మూడవ వికెట్ కు 44 పరుగులు జోడించారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పటీదార్ ధాటిగా ఆడి 16 బంతుల్లో 34 పరుగులు చేసి ఆర్సీబీ గెలుపును ఖాయం చేశాడు
ఛేదనలో కింగ్ అయిన విరాట్ కోహ్లీ చివర వరకు నిలబడి 36 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లివింగ్ స్టోన్ 5 బంతుల్లో రెండ్ ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 15 పరుగులు చేసి మ్యాచ్ ను తొందరగా ముగించాడు
ఆర్సీబీ 16. 2 ఓవర్ల లోనే 177 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, సునీల్ నరైన్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు
అంతకు ముందు, టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది
మొదటి ఓవర్ రెండవ బంతికి ఫోర్ కొట్టిన క్వింటన్ డికాక్, మూడవ బంతికి హాజిల్ వుడ్ బౌలింగ్ లో గాల్లోకి లేపాడు. అయితే సుయాష్ శర్మ క్యాచ్ వదిలేయడం తో బతికి పోయిన క్వింటన్ డికాక్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఐదవ బంతికి కీపర్ జితేష్ శర్మ చేతికి చిక్కాడు.
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రహానే తో కలిసిన మరో ఓపెనర్ సునీల్ నరైన్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించాడు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 103 పరుగులు జోడించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో, మూడు సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేశాడు. కెప్టెన్ రహానే 31 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్ల సహాయంతో 56 పరుగులు చేశాడు
అయితే సునీల్ నరైన్ అవుట్ అయ్యిన తరవాత కోల్ కతా నైట్ రైడర్స్ వికెట్ల పతనం ఆరంభమయింది. అది ఎంతలా అంటే ఒక వికెట్ నష్టానికి 106 పరుగులు చేసిన కె కె ఆర్, తరవాతి 44 పరుగులకు 5 వికెట్ లు కోల్పోయింది.
సూపర్ పవర్ హిట్టర్ రింకు సింగ్ 12 పరుగులు చేసి క్రునాల్ పాండ్య బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. రహానే, నరైన్ ల తరవాత కె కె ఆర్ టాప్ స్కోరర్ అయిన రఘువంశి, అప్పటిదాకా నిలకడగా ఆడి 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో స్పిన్నర్ కృనాల్ పాండ్య మూడు వికెట్ లు తీయగా, జోష్ హేజిల్ వుడ్ రెండు వికెట్ లు తీశాడు. రసీక్ సలాం, సుయాశ్ శర్మ, యష్ దయాల్ లు తలా ఒక వికెట్ తీశారు
ఈ మ్యాచ్ లో కొట్టిన సిక్స్ లతో నరైన్ ఐపీల్ లో 100 సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు

