టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్.
ఈ చిత్రం ట్రైలర్ ను రేపు అంటే మార్చ్ 23 న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో విడుదల చేయనున్నారు. HICC నోవొటెల్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు HICC నోవొటెల్ లో, హాల్ 3 లో ఈ కార్యక్రమం జరగనుంది
ఈ ఈవెంట్ కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వస్తున్నాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మార్చి 28న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.

