యూకే పార్లమెంట్ చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందించిన ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి విజయాలు, ఘనతల తో పాటు ఆయనకు వచ్చిన అవార్డుల గురించి తెలుసుకుందాం
- 1978 లో ప్రాణం ఖరీదు తో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించారు చిరంజీవి
- ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరో పుట్టిన రోజులు చిరంజీవి పుట్టిన రోజు జరిగినంత ఘనంగా జరగవు
- పర్సనల్ వెబ్ సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు చిరంజీవి
- ఒక హీరో మీద ఒక దర్శకుడు ఒక మ్యాగజైన్ నడపడం కూడా రికార్డు. దర్శకుడు విజయబాపినీడు చిరంజీవి పేరు మీద ఒక మ్యాగజైన్ నడిపాడు ( ఈ మ్యాగజైన్ పేజీలు పూర్తిగా ఆయిల్ ప్రింటెడ్). విజయబాపినీడు గారు ఈ పత్రికను 5 సంవత్సరాలు నడిపారు.
- అభిమానులు సైతం మెగా పవర్, మెగా బ్రదర్స్, మెగా స్టార్ అనే పత్రికలు నడిపారు
- అభిమాన సంఘాలకు గుర్తింపు తెచ్చిన హీరో చిరంజీవి
- 1987 లో ఆస్కార్ వేడుకలో అతిధి గా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు చిరంజీవి
- కోటి కి పైగా పారితోషికంగా మొదటి భారతీయ నటుడు
- 1999-2000 వ ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తి మెగా స్టార్ చిరంజీవి
- 10 కోట్లు వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రం ఘరానా మొగుడు
- 30 కోట్లు వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రం ఇంద్ర
- రష్యన్ భాషలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రం స్వయంకృషి
- 1980, 1983 సంవత్సరాలలో ఏకంగా చిరంజీవి నటించిన 14 సినిమాలు విడుదలయ్యాయి
- పసివాడి ప్రాణం సినిమా ద్వారా బ్రేక్ డాన్స్ ను చేసిన హీరో చిరంజీవి
- ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ఆడిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్న హీరో చిరంజీవి
- చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్త, నేత్ర దానాలపై ప్రజలలో ఆవాహన కల్పించడమే కాకుండా తన అభిమానులను సేవ కార్యక్రమాలకు మళ్లించిన ఏకైక హీరో మెగా స్టార్ చిరంజీవి
- అత్యధిక ఫిలిం ఫేర్ అవార్డు లు అందుకున్న తెలుగు హీరో చిరంజీవి
- మెగా స్టార్ చిరంజీవి శివుడిగా పార్వతి పరమేశ్వరులు, ఆపద్బాంధవుడు, జగద్గురు అది శంకరాచార్య చిత్రాలలో మెరిశారు. పూర్తి స్థాయి శివుడి వేషం లో శ్రీ మంజునాథలో నటించి మెప్పించారు
- 9 సంవత్సరాల గ్యాప్ తరవాత సినిమాలలోకి కూడా వచ్చి ఈ తరం ప్రేక్షకులకు దగ్గరైన హీరో చిరంజీవి. సీనియర్ హీరోలలో 3 వంద కోట్ల షేర్ సినిమాలు కలిగిన హీరో చిరంజీవి
- 150 కి పైగా సినిమాలలో నటించి, సుమారు 47 సంవత్సరాలుగా కళామతల్లికి సేవలందిస్తున్న హీరో చిరంజీవి. 70 ఏళ్ళ వయసులో కూడా యువ హీరోలతో పోటీపడుతున్న హీరో చిరంజీవి
చిరంజీవి కి వచ్చిన ప్రతిష్టాత్మకమైన అవార్డులు
- 2006 లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టరేట్
- 2006 లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ అవార్డు
- 2022 లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు
- 2024 లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ అవార్డు
- 2024 లో మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ సినిమా – గిన్నిస్ వరల్డ్ రికార్డు – 45 సంవత్సరాలలో, 156 సినిమాలలో, 537 పాటలలో, 24 వేల డాన్స్ మూవ్స్
- 2025 లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు – యూకే పార్లమెంట్ – హౌస్ అఫ్ కామన్స్, లండన్

