కోర్ట్ నుండి సూపర్ హిట్ సాంగ్ ‘ప్రేమలో’ పాట విడుదల

by | Mar 21, 2025 | సినిమా

నాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రం నుండి సూపర్ హిట్ సాంగ్ ‘ప్రేమలో’   పాట వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డీ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్​ను దూసుకెళ్తోంది.

ఈ వీకెండ్ నాటికి కోర్ట్ మూవీ రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు.