తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగియగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మార్చి 22న శనివారం ఉదయం 10.35 గంటలకు ఆ సర్ప్రైజ్ రివీల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
కాగా, ‘ఓదెల 2’ (Odela) మూవీ టీజర్‌ను ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ మేళాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దింతో మహాకుంభ్ మేళాలో టీజర్ రిలీజ్ చేసుకోనున్న మొదటి భారతీయ సినిమాగా ‘ఓదెల 2’ మూవీ అరుదైన ఘనత సాధించింది. మొదటి భాగాన్ని మించి ఉండేలా భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతికతో ఈ మూవీ తెరకెక్కించినట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందని ఈ సినిమాలో తమ్మన్నా (Tamannah) పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.

