నాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్’: ది థర్డ్ కేస్’ ఫుల్ లెంగ్త్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇప్పటికే రిలీజైన ‘హిట్ 3’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి ‘ప్రేమ వెల్లువ..’ అనే ఫస్ట్ సింగిల్ మార్చి 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే హిట్3 నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరో నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు అనిపిస్తుంది. ఇక మిక్కీ జే మేయర్ సంగీత స్వరాలు అందించిన ‘ప్రేమ వెల్లువ..’ ట్యూన్ అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇటీవలే బడా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ. 55 కోట్లకి దక్కించుకున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్సే సొంతం చేసుకుంది. కాగా, హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకుముందు యువ హీరోలు విష్వక్ సేన్ ‘హిట్’, అడివి శేష్ ‘హిట్ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్ 3’పై (HIT) భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా వేసవి కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

