‘హరి హర వీరమల్లు’.. ఇప్పుడు అందరి చూపు ఆమె వైపే.!

by | Mar 21, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veera Mallu) పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన త‌ర్వాత ఈ సినిమా వ‌స్తుండ‌టంతో మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. కాగా, భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ విడుదల కోసం అటు అబిమానులు, ఇటు​ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 28న రిలీజ్​ అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం అఫీషియల్​గా ప్రకటించింది. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్టి సారించారు మేకర్స్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్‌ కల్యాణ్‌ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సినిమా హిట్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ జ్యోతికృష్ణ, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రమోషన్స్ లో పాల్గొన్నా అంతగా హైప్ క్రియేట్‌ చేయలేరని తెలిసిందే. దింతో ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అందరూ హీరోయిన్ నిధి అగర్వాల్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్‌ ‘హరి హరవీరమల్లు’ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్ కు చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్న నిధి ఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యతల్ని కూడా తానే తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు, టీవీ షోలలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ‘హరి హరవీరమల్లు’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నిధి అగర్వాల్‌ పలు నగరాల్లో కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అందుబాటులో లేకున్నా కూడా నిధి అగర్వాల్ సినిమా ప్రచార బాధ్యతల్ని చేపట్టడంపై మెగా అబిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.