సూపర్ హిట్లకి కేరాఫ్‌గా నాని..సినిమా చేస్తే బ్లాక్ బస్టరే!

by | Mar 21, 2025 | సినిమా

టాలీవుడ్‌లో యువ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా ఏదైనా సరే మినిమమ్‌ గ్యారెంటీ అని అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. వారి ఆసక్తికి తగ్గట్లుగానే నాని నటించే సినిమాలు వస్తుంటాయి. డిఫరెంట్ జానర్లలో కొత్త కథలతో ఎప్పుడూ కూడా అభిమానుల్ని అలరించేందుకు నాని సిద్ధంగా ఉంటారు. ఇటీవల నాని నిర్మాతగా మారి తన వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం ‘ కోర్ట్‌’. ఈ సినిమాతో తాజాగా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న నాని (Nani) మంచి జోరు మీద ఉన్నారు. ఓవైపు హీరోగా హిట్స్ కొడుతూనే మరోవైపు నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇండ‌స్ట్రీకి కొత్త వారిని ప‌రిచ‌యం చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నాడు.

మొదట ‘అ!’ సినిమాతో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని, ఆ తర్వాత ‘జర్సీ’ సినిమాతో గౌతమ్ తిన్ననూరిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. అనంతరం ‘శ్యామ్ సింగరాయ్’తో రాహుల్ సాంకృత్యాయన్‌ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన నాని అటు తర్వాత ‘దసరా’తో శ్రీకాంత్ ఒదేలాను అలాగే ‘హాయ్ నాన్న’తో షౌర్యువ్ వంటి యువ దర్శకులకు అవకాశమిచ్చి ఇండ‌స్ట్రీలోకి ప‌రిచ‌యం చేశాడు. వీరితో పాటుగా తాజాగా ‘కోర్ట్’ (Court) సినిమాతో రామ్ జ‌గ‌దీష్ వంటి యంగ్ డైరెక్టర్ ను ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేసి సూప‌ర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక నాని నిర్మాణంలో వ‌చ్చిన హిట్ 1, హిట్ 2 సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యాల్ని అందించాయి. శైలేష్ కొల‌ను అనే డైరెక్టర్ ఈ సినిమాల‌తో త‌న‌లోని సత్తా చూపించాడు. ఇక త్వ‌ర‌లో హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ప్రస్తుతం జోరు మీదున్న నాని (Natural Star Nani) రాబోయే రోజుల్లో మరెంత మంది కొత్త డైరెక్టర్లను ఇండ‌స్ట్రీకి తీసుకొస్తాడో ఎలాంటి సినిమాలను నిర్మిస్తాడో అన్నది చూడాలి.