రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో విభిన్న కోణాలు ఉంటాయట. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో వినిపించిన డైలాగ్‌లు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లుక్, గెటప్ అన్నీ అక్కట్టుకునేలా ఉన్నాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
అయితే ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం ఈ ఏడాది మే 30న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ అంశంపై ఇటీవల మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ కీలక కామెంట్లు చేశారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే కింగ్‌డమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. కింగ్‌డమ్ స్టోరీ రెండు భాగాలుగా దర్శకుడు నాకు చెప్పాడు. అయితే గౌతమ్ ఫస్ట్ పార్ట్ చెప్పినప్పుడు, సెకండ్ పార్ట్‌కు వేరే స్క్రీన్‌ప్లే ఉంటుందని చెప్పాడు. అయితే, ఈ మూవీ సెకండ్ పార్టుకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. తొలి భాగం హిట్ అయితే సీక్వెల్ తీసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం.” అంటూ నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.

