టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి మహాదేవ శాస్త్రి గా మోహన్ బాబు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు
మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు పాత్ర అయిన మహాదేవ శాస్త్రి గ్లింప్స్ ను, పాటను విడుదల చేశారు
మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ ను రూపొందిస్తున్నారు
ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుతో పాటుగా శరత్‌కుమార్, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
మంచు కుటుంబం నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

