మోహన్‌బాబుకి మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్

by | Mar 19, 2025 | వార్తలు

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్, విలక్షణ న‌టుడు మంచు మోహ‌న్ బాబు మార్చి 18న త‌న 73వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు త‌న కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. ప్ర‌తిసారి మన ఇంట్లో అందరం క‌లిసి ని పుట్టినరోజు జ‌రుపుకునే వాళ్లం. ఈరోజు మీతో లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. నీతో క‌లిసి ఉన్న క్షణాలను ఆస్వాదిస్తున్నా. ల‌వ్ యూ సో మచ్ నాన్న” అంటూ మంచు మ‌నోజ్ పోస్ట్ చేశాడు. అలాగే మోహన్‌ బాబు ఫోటోతో పాటుగా ఆయనతో సినిమాల్లో నటించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను యానిమల్ సినిమాలోని నా సూర్యుడివి, చంద్రుడివి అంటూ సాగే పాటను జత చేశాడు. ఇక మంచు విష్ణు చేసిన పోస్ట్‌కు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి లైక్‌ కొట్టడం విశేషం.

ఇదిలాఉంటే..మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయన్న సంగతి తెలిసిందే. కుటుంబం మధ్య ఆస్తుల గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఒక‌రిపై మ‌రోక‌రు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. దింతో ఇంటి గొడవలు కాస్తా పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. మంచు కుటుంబం నుంచి వ‌స్తున్న ప్రతిష్టాత్మక చిత్రం క‌న్న‌ప్ప (Kannappa) ఇందులో మంచు విష్ణు హీరోగా న‌టిస్తుండ‌గా.. దాదాపు రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ సినిమాను మోహ‌న్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. చిత్రం. ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తుంది చిత్ర‌బృందం. ఇక మరోవైపు మంచు మనోజ్ ‘బైరవం’ చిత్రంతో రానున్నారు.