‘ఆర్‌సీ16’: పార్లమెంట్‌లో చరణ్.. బుచ్చిబాబు మాస్టర్ స్కెచ్!

by | Mar 19, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా..
క‌న్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ (Ram Charan( ఆట కూలీగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్‌ అన్ని ఆటల్లో ఆరితేరి ఉంటాడట. అందుకే క్రికెట్‌, కుస్తీ, కబడ్డీ ఇలా ఆట ఏదైనా డబ్బులిస్తే ఆయా జట్ల తరపున బరిలోకి దిగుతాడాని తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం ఆవరణలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఇక్కడ రామ్‌చరణ్‌ (Ram Charan) తో పాటు ఇతర ముఖ్య నటులపై సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారుల అనుమ‌తులు కూడా అందినట్లు సమాచారం. అలాగే కథలో భాగంగా ఢిల్లీలోని జామా మసీదు ఆవరణలోనూ ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ అనుమతులు కూడా తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వరకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో జరుగుతుంది. ఇక మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ ని, టీజ‌ర్‌ని రామ్‌ చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.