నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కోర్టు (Court) సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28.90 కోట్ల కలెక్షన్లు వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సఫీస్ వద్ద మొదటిరోజు రూ. 8.10 కోట్ల వసూళ్లు రాగా, రెండో రోజు రూ. 7.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడోరోజు ఆదివారం ఏకంగా రూ. 8.50 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే నాలుగో రోజు వర్కింగ్ డే సోమవారం అయినప్పటికీ ఈ మూవీ నాలుగో రోజైన రూ. 4.50 గ్రాస్ వసూళ్లు రాబట్టింది.యూఎస్ లో తాజాగా 700K డాలర్ మార్క్ ను దాటేసిన ఈ మూవీ 1 మిలియన్ మైల్ స్టోన్ వైపుకు పరుగులు తీస్తుంది. ఇక్కడే కాకుండా ఓవర్సీస్లోనూ కోర్ట్ మూవీ ఆదరగొడుతుంది. కాగా, కోర్ట్ మూవీకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ వీకెండ్ నాటికి కోర్ట్ (Court) మూవీ రూ. 50 కోట్ల క్లబ్లో చేరే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు

