నితిన్, వెంకీ కుడుముల మధ్య లో ఏ ఐ

by | Mar 18, 2025 | సినిమా

మైత్రి మూవీ మేకర్స్ నితిన్, శ్రీ లీల జంటగా నిర్మిస్తోన్న చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు.  ఈ రాబిన్ హుడ్ చిత్రం మార్చ్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ రాబిన్ హుడ్ ట్రైలర్ ను మార్చ్ 21 న సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అయితే నితిన్, వెంకి కుడుముల ఏ ఐ సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. ఏ ఐ తో రాబిన్ హుడ్ టీం ముహుర్తాలు కూడా పెట్టిస్తున్నారు

ఇదిలా ఉంటె, రిలీజ్ కు ముందే రాబిన్ హుడ్ ఓ అరుదైన ఘనతను సాధించింది. 2025 మార్చి నెలలో విడుదల కానున్న సినిమాల్లో ‘రాబిన్‌హుడ్’ మూవీ అగ్ర స్థానంలో నిలిచినట్లు ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDb) ఐఎండిబి సంస్థ ప్రకటించింది. టాలీవుడ్ లో 2025 మార్చి నెలలో విడుదల కానున్న చిత్రాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాగా ‘రాబిన్‌హుడ్’ (Robinhood) నిలిచిందని ఈ సందర్భంగా ఐఎండిబి వెల్లడించింది. దీనిపై నితిన్ అబిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’ సినిమాతో నితిన్ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ (David Warner) న‌టించ‌బోతున్నాడ‌న్న సంగతి  తెలిసిందే. వార్నర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.