పుష్ప‌2, బాహుబ‌లి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తూ.. ‘ఛావా’ నయా సెన్సేషన్

by | Mar 18, 2025 | సినిమా

బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandana) కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 700 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. కాస్త ఆలస్యంగా విడుదలైనప్పటికీ ఛావా తెలుగు వెర్షన్ రూ. 15 కోట్లను దాటేసింది. గత వారం ‘కోర్ట్’ మూవీ రిలీజ్ అవకుండా ఉండుంటే సునాయాసంగా రూ. 25 కోట్ల మైలురాయిని దాటేసి ఉండేది. అయితే తాజాగా ‘ఛావా’ మూవీ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐదో వీకెండ్‌లో రూ. 22 కోట్లు వసూళ్లు సాధించిన ఈ మూవీ ‘పుష్ప 2’ పేరిట ఉన్న రికార్డ్‌ని చేరిపేసింది.

పుష్ప‌2 (Pushpa) మూవీ ఐదో వీకెండ్‌లో రూ.14 కోట్ల కలెక్షన్లు సాధించగా తాజాగా ఆ రికార్డును ఛావా బ్రేక్ చేసింది. దాంతో పాటుగా ఐదో వీకెండ్‌లో రూ. 8.5 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 (Bahubali) ను కూడా వెనక్కినెట్టింది. మొత్తంగా హిందీ మార్కెట్‌లో ఐదో వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 సినిమాలలో ఛావా రూ.22 కోట్లుతో అగ్ర స్థానంలో ఉండగా… రెండో స్థానంలో రూ. 16 కోట్లతో స్త్రీ మూవీ మూడో స్థానంలో రూ. 14 కోట్లతో పుష్ప 2 మూవీ ఉన్నాయి. కాగా, బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ‘ఛావా’ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ (Chava) ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా నటించగా.. మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.