రిలీజ్​కు ముందే ‘రాబిన్‌హుడ్‌’ అన్​బీటబుల్ రికార్డ్

by | Mar 18, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. బ్యూటీ క్వీన్ శ్రీలీల కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలుకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భీష్మ మూవీ త‌ర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. నితిన్ ఇందులో రాబిన్ హుడ్ (Robin Hood) అనే దొంగ పాత్ర‌లో నటిస్తున్నాడు. అలాగే రాజేంద్రప్రసాద్‌ ఏజెంట్‌ జాన్ స్నో పాత్రలో కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్ప‌టికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

‘రాబిన్‌హుడ్‌’ (Robinhood) సినిమా మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. రిలీజ్ కు ముందే ఓ అరుదైన ఘనతను సాధించింది. 2025 మార్చి నెలలో విడుదల కానున్న సినిమాల్లో ‘రాబిన్‌హుడ్’ మూవీ అగ్ర స్థానంలో నిలిచినట్లు ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDb) ఐఎండిబి సంస్థ ప్రకటించింది. టాలీవుడ్ లో 2025 మార్చి నెలలో విడుదల కానున్న చిత్రాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాగా ‘రాబిన్‌హుడ్’ నిలిచిందని ఈ సందర్భంగా ఐఎండిబి వెల్లడించింది. దీనిపై నితిన్ అబిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’ సినిమాతో నితిన్ (Nithin) సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ న‌టించ‌బోతున్నాడ‌న్న సంగతి తెలిసిందే. వార్నర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.