గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. తాజాగా ‘ఆర్‌సీ16’ స్టోరీ బ్యాగ్డ్రాప్ ఇదేనా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) అద్దె ఆటగాడిగా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్ అన్ని ఆటల్లో ప్రావీణ్యుడై ఉంటాడట. అందుకే క్రికెట్, కుస్తీ, కబడ్డీ.. ఇలా ఏ గేమ్ అయినా సరే కొంత డబ్బులిస్తే, వాళ్ల జట్టు తరఫున బరిలోకి దిగుతూ ఒంటిచేత్తో తన జట్లను గెలిపిస్తూ ఉంటాడట. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ మైసూరులో పూర్తవగా.. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరువుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఎక్కువగా రాత్రి సమయాల్లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. తీస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ లాంటివి అంతగా లేవని, దీంత వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మార్చి 27న రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు కానుకగా టైటిల్, టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

