నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడుగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. కాగా, అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇందులో మురళీకృష్ణగా, అఖండ రుద్రసికిందర్ అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్ని బాలయ్య (Bala Krishna) పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాలయాల్లో అఖండ రుద్రసికిందర్ అఘోరా పాత్రపై కీలక సన్నివేశాలను తీస్తారట బోయపాటి.
అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అఖండ (Akhanda) 2లో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. రుద్రసికిందర్ అఘోర పాత్రలో బాలయ్య, హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తుండగా ఆయన పాత్ర రివీల్ అవుతుందని ఆ సమయంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తంలోనే ఈ ఇంట్రడక్షన్ సీన్ హైలైట్ గా ఉండనుందని అంటున్నారు. భారత సినీ చరిత్రలోనే తొలిసారిగా హిమాలయాల్లో ఎవరూ చూపించని లోకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్లో బాలయ్యతో పాటుగా కీలక పాత్రధారులంతా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో వివిధ భాషలనుంచి నటీనటులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ ఈ మూవీలో అఖండ రుద్ర సికిందర్ అఘోరాను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది

