‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ నుంచి పవర్‌ఫుల్‌ టీజర్

by | Mar 17, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ‍ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ ను ఎలాగైతే చూడాలని అనుకుంటారో ఇందులో అలాగే కనిపించాడు. విజయశాంతి పవర్ ఫుల్ క్యారెక్టర్ చూసి ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టీజర్‌ సాగింది.

కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. గతంలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా వైజయంతి పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. దాంతో ఈ సినిమాలో కూడా విజయశాంతి పోషిస్తున్న పాత్రకూ వైజయంతి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అబిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.