ప్రభాస్ రిలీజ్​ డేట్​లో వస్తున్న ప్రదీప్‌ మాచిరాజు

by | Mar 16, 2025 | సినిమా

తెలుగులో యాంకర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్‌ మాచిరాజు (Pradeep Machiraju)‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం డుయో నితిన్‌, భరత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్‌ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తుంది. మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, సత్య, గెటప్‌శ్రీను, మురళీధర్‌గౌడ్‌, రోహిణి, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులోని లేలేలేలే అనే సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయడంతో ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించారు. ఈ ఏడాది వేసవి కానుకగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రాన్ని ఏప్రిల్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఏప్రిల్ 10న ప్రభాస్ ‘ది రాజాసాబ్’ (Rajasaab) సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆ తేదీన విడుదల కావడం లేదు దాంతో చిన్న సినిమాలు ఆ డేట్స్ ను లాక్ చేసేస్తున్నాయి. ఇప్పటికే సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ తో మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించగా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ కూడా అదే తేదీన రిలీజ్ కానుంది. వీటితో పాటుగా హిందీలో గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ‘జాట్’ సినిమాను కూడా అదే తేదీన విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇలా వరుస చిత్రాలు వరుస తేదీలలో విడుదల కానుండడంతో ప్రదీప్ మాచిరాజుకి బాక్సఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.